మారికవలస (మన్యం) : మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంకి గిరిజనులకు బాసటగా నిలవడానికి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర ను పోలీసులు అడ్డుకున్నారు. సాలూరులోని రాజన్న దొర ఇంటివద్దకు చేరుకున్న పోలీసులు ఈరోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ బయటకు కారులో వెళ్ళటానికి బయలుదేరిన రాజన్నదొరను పోలీసులు అడ్డగించారు. కారును చుట్టుముట్టి, ఆపి మళ్లీ అతనిని ఇంటికి తరలించారు. తనను అరెస్ట్ అయినా చేయండి లేదా బయటకి అయినా వెళ్ళనివ్వండి అని పోలీసులను రాజన్న దొర కోరారు. చాలాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగిన తర్వాత తిరిగి ఇంటికి పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని, వైసిపి ప్రభుత్వంలో గానీ తాము ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారిని అరెస్ట్ చేయడం గానీ, నిర్బంధించడం గాని చేయలేదు అని పోలీసులకు రాజన్నదొర వివరించారు. ఇప్పటికైనా గిరిజన శాఖ మంత్రి నైజం తెలుసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ గిరిజనులను కోరారు.









కామెంట్‌లు (0)