ప్రజాశక్తి – సాలూరు : జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను సొంతంగా గానీ, జనగణన కోసం వచ్చే ప్రభుత్వ సిబ్బంది వద్ద గానీ తప్పకుండా నమోదు చేసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరులో స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే 5కె అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ప్రక్రియపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని, ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎంతో కీలకమని, ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.పార్వతీపురంటౌన్: రాబోయే దేశవ్యాప్త జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురంలో 5కె రన్ నిర్వహించినట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రన్ స్థానికమున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమై, పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, జనగణన అనేది కేవలం అంకెల సేకరణ మాత్రమే కాదని, అది దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. జనగణన ప్రాముఖ్యతను ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు గణన ప్రక్రియలో ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. జనగణన విజయవంతానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా గణన అధికారులకు సరైన వివరాలు అందించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.హేమలత, మున్సిపల్ కమిషనర్ డి.పావని, డిఇఒ పి.బ్రహ్మజీరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.పాలకొండ : స్వీయ జనగణన ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కమిషనర్ రత్నరాజు, తహశీల్దార్ రాధాకృష్ణవ¶ర్తి అన్నారు. జనగణన సందర్భంగా ఆదివారం కోటదుర్గ ఆలయం నుంచి 5కె రన్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌ఒ చిన్నారావు తదితరులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ జనగణనలో పాల్గొనాలి
26 ఏప్రిల్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఏప్రి 26, 2026, 03:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)