సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సామాజిక న్యాయానికి ప్రతీక బాబూ జగ్జీవన్ రామ్

1 గంట క్రితం

సామాజిక న్యాయానికి ప్రతీక బాబూ జగ్జీవన్ రామ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కనిగిరి (ప్రకాశం) : సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయ ప్రాంగణంలో సోమవారం ఆయన విగ్రహానికి కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో విశిష్ట ముద్ర వేసిన మహానేత అని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజాసేవకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులు ఘటించారు. ఎంపీపీ దంతులూరి ప్రకాశం, కనిగిరి పీఏసీఎస్ అధ్యక్షులు అద్దంకి రంగబాబు, టిడిపి పట్టణాధ్యక్షుడు షేక్ ఫిరో జ్, యూత్ అధ్యక్షులు అచ్చాల రవి, మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి, కన్వీనర్ పిచ్చాల శ్రీనివాసరెడ్డి, టిడిపి నాయకులు బాలు ఓబుల్ రెడ్డి, గంగవరపు నాగిరెడ్డి, ముచ్చుమారి చెంచి రెడ్డి, కనిగిరి మనోహర్ రావు, చింతలపూడి తిరుపాలు, రాచర్ల వెంకటనారాయణ, ఈదర రవికుమార్, కొల్లూరి శ్రీనివాసులు, జంషీర్ అహ్మద్, షరీఫ్, నజీముద్దీన్, చిలకపాటి లక్ష్మయ్య, బి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్