- చెరువుకొమ్ముపాలెంలో విషాదం
- కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు మృతదేహం లభ్యం
ప్రజాశక్తి - ఒంగోలు : ఒంగోలు పట్టణ శివారులోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలుడు జి. రిచర్డ్ రేయాన్స్ మృతదేహం గ్రామంలోని గుర్రంవారి చెరువులో లభ్యమవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మధ్యాహ్నం నుంచి బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఒంగోలు తాలూకా పోలీసులు అత్యవసరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం సుమారు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలు, కాలువలు, చెరువులు, సీసీ కెమెరా దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు స్వయంగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. బాలుడి తల్లిదండ్రులను పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాలింపు అనంతరం గ్రామంలోని గుర్రంవారి చెరువులో బాలుడి మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకుని విషాదంలో మునిగిపోయారు.








కామెంట్‌లు (0)