గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యానికి బానిసైన తండ్రి ఘాతుకం..

2 రోజుల క్రితం

prakasam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -అర్ధవీడు : మద్యానికి బానిసైన తండ్రి కొడుకును హత్య చేసిన ఘటన అర్ధవీడు మండలంలోని మెట్టిమీదపల్లి గ్రామంలో జరిగింది. ఒకే కుటుంబంలో జరిగిన ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మద్యానికి బానిసైన తండ్రి డబ్బులు ఇవ్వలేదనే ఆగ్రహంతో నిద్రిస్తున్న తన చిన్న కుమారుడు పఠాన్ జావిద్ భాష (26)పై క్రికెట్ బ్యాట్‌తో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన జావిద్ భాషను తల్లి సబిరా, కుటుంబ సభ్యులు వెంటనే కారులో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి పఠాన్ సిలార్ సాహెబ్ (51) ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడి మృతితో పాటు తండ్రి కూడా ప్రాణాలు తీసుకోవడంతో ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించాయి. ఈ ఘటనతో మెట్టిమీదపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిలార్ సాహెబ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇప్పటికే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్