శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్గో పార్సెల్ వాహనంలో మంటలు

5 రోజుల క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - శింగరాయకొండ: శిoగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని రన్వే మీద ఒంగోలు వైపు నుంచి కావలికి వెళుతున్న ఆర్.ఎస్.ఆర్ ఎక్స్ప్రెస్ కార్గో టాటా బడా దోస్త్ వాహనం ఇంజన్ దగ్గర ఉన్న ఏసీలో పొగలు రావడంతో డ్రైవర్ గమనించి లారీని ఆపివేశారు. డ్రైవర్ దిగిన ఒక్క సెకండ్ లోనే పెద్ద ఎత్తున ఇంజన్లో మంటలు రావడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్గో పార్సెల్ కు సంబంధించిన లారీ విజయవాడ నుంచి చెన్నైకి వెళుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరగడంతో హైవే పోలీసులు హైవే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి టంగుటూరు ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. సీఐ వై శ్రీహరి ఎస్ఐ లేళ్ల సుధీర్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చి భారీ నష్టం చోటు చేసుకోకుండా చేయడం జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్