మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

09 సెప్టెంబర్, 2026

Man sustains severe injuries in road accident.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగులప్పలపాడు (ప్రకాశం) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం నాగులప్పలపాడులో జరిగింది. ఉప్పుగుండూరు–నాగులప్పలపాడు మధ్య జాతీయ రహదారి 216 పై ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీరాల వైపు నుంచి వస్తున్న పాల వ్యాన్‌ను, ఒంగోలు వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్