గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకాశం పోలీస్ కార్యాలయంలో నూతన పోలీస్ హాస్పిటల్ ప్రారంభం

6 రోజుల క్రితం

New police hospital inaugurated at the Prakasam police office.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 02:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకాశం : విధి నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సూచించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో, కిమ్స్ ఆస్పత్రుల సహకారంతో జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ హాస్పిటల్‌ను శుక్రవారం కలెక్టర్, ఎస్పీ, కిమ్స్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలరని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పోలీసు సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను, కిమ్స్ యాజమాన్యం సహకారాన్ని అభినందించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో రిసెప్షన్, డ్రగ్స్ డిస్పెన్సరీ, ల్యాబొరేటరీ, వైద్యుల గదులు, నిపుణుల సేవలకు ప్రత్యేక గదులు, ప్రాథమిక చికిత్స, క్రమానుగత ఆరోగ్య పరీక్షలు, అత్యవసర వైద్య సహాయం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో బొల్లినేని అద్విక్, టి. గిరినాయుడు, ప్రవీణ్, కె. అంకిరెడ్డి, హరి రెడ్డి, డా. శ్రీనివాసరావు, ఆర్. శ్రీనివాసరావు (డీఎస్పీ), సీఐలు విజయకృష్ణ, వెంకటేశ్వరరావు, శేషగిరిరావు, ప్రసాద్, హాజరత్తయ్య, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఎస్సై వేణుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్