గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శిoగరాయకొండలో జాతీయ జెండాతో ర్యాలీ

9 గంటల క్రితం

rally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - శిoగరాయకొండ: ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని శిoగరాయకొండలో 100 అడుగుల జాతీయ జెండాతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీగా ర్యాలీ నిర్వహించారు. శిoగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నుంచి ఆర్టీసీ బస్టాండు రైల్వే రోడ్డు మీదగా కందుకూరు రోడ్డు మినీ బైపాస్ మీదగా ప్రభుత్వ పాఠశాల వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎన్ వి బి రాజేష్, ఇన్చార్జి ఎండిఓ డి వెంకట్రావు, మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావు, ఆవుల శ్రీనివాసరావు, సీఐ వై శ్రీహరి, ఎస్సై లేళ్ల సుధీర్ కుమార్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్