శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసుల తీరుపై చుండూరు రవిబాబు తీవ్ర అభ్యంతరం

6 రోజుల క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రతి డివిజన్‌ నుంచి ఏజెంట్లు,కార్యకర్తలను తీసుకెళ్లడంపై ఆవేదన

ఒంగోలు సిటీ: ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో తాలూకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల నుంచి వైసిపి పోలింగ్‌ ఏజెంట్లు,పార్టీ కార్యకర్తలను పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి చుండూరు రవిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివారం తాలూకా పోలీస్‌స్టేషన్‌ వద్ద మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎటువంటి నేర చరిత్ర లేని సాధారణ వ్యక్తులను అభ్యర్థులుగా నిలబెట్టామని,తాము ఎక్కడా ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించడం లేదని తెలిపారు. తమ ఏజెంట్లు, కార్యకర్తలు ప్రశాంతంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నప్పటికీ వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడం వెనుక ఉద్దేశమేమిటని నిలదీశారు. చెరువుకొమ్ముపాలెంకు చెందిన కృష్ణారెడ్డిపై తప్పుడు కేసు నమోదు చేసి తీసుకొచ్చారని ఆరోపించారు. ఐదో డివిజన్‌, 60వ డివిజన్‌ సహా సర్కిల్‌ పరిధిలోని పలు డివిజన్ల నుంచి పోలింగ్‌ ఏజెంట్లను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, పోలింగ్‌ ఏజెంట్లకు స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు వ్యవహరించాలని చుండూరు రవిబాబు కోరారు.

ap

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్