ప్రజాశక్తి - నెల్లూరు జిల్లా : 50 ఏళ్లకి ముస్లిం మైనార్టీలకు ఫించన్లు ఇవ్వాలని కోరుతూ ఆవాజ్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా గురువారం ముత్తుకూరు యంపిడిఓ కార్యాలయం లో సూపరింటెండెంట్ గారి కి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో ముస్లిం మైనారిటిలకు 50 ఏళ్లకు ఫించన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అయినప్పటికీ మైనారిటీలకు ఇచ్చిన హామీలు దులహన్ పథకం, సబ్సిడీ రుణాలు, పింఛన్లు అమలు చేయలేదన్నారు. మైనారిటిల ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నదని సచార్ కమిటి, జస్టిస్ రంగనాధ్ మిశ్రా నివేదికలు తెలుపుతున్నాయన్నారు. ముస్లిం మైనారిటీల పిల్లలు చిన్న వయసులోనే చదువులకు దూరమై అనేక మంది చేతి వృత్తుల్లోకి చేరిపోతున్నారని అన్నారు. కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అతి చిన్న వయసు నుండే పని చేస్తూ చాలామంది 50 సంవత్సరాలకే కష్టం చేయలేని స్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీల స్థితి, గతులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జరుగుతున్న పింఛన్ల ప్రక్రియలోనే వారికి కూడా పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం తమ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ ముత్తుకూరు మండల కమిటి సభ్యులు పి. హాబీబ్, షేక్ ముజీర్, షేక్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకు పింఛన్ల ప్రభుత్వ హామీని నెరవేర్చాలి : ఆవాజ్
10 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 02:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)