ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వాగ్దానాలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు : సిపిఎం, సిఐటియు

3 గంటల క్రితం

sklm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -మందస : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి హెచ్చరించారు. స్థానిక మందసలో ఆదివారం కార్మికుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, ఇచ్చాపురం వరకు నీరు ఇస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే జీడికి గిట్టుబాటు ధర కల్పించి, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పిందని అన్నారు. వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి సుందర శ్రీకాకుళం నిర్మిస్తామని,కోడి రామమూర్తి స్టేడియం పూర్తి చేస్తామని రిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేస్తామని ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివర భూములు ఇచ్చాపురం వరకు నీరిస్తే జిల్లా సస్యశ్యామలమవుతుందని తద్వారా జిల్లా అభివృద్ధి అవుతుందని అన్నారని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరు ఎత్తినట్లు చూస్తుందని విమర్శించారు. జీడీకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వాగ్దానాలు అమలు చేయకుండా జిల్లా విద్వాంసానికి పూనుకుంటున్నారని విమర్శించారు. సముద్ర తీర ప్రాంతాన్ని ఆదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి తీర ప్రాంతం విధ్వంసానికి పూనుకుంటుందని విమర్శించారు. ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది షెడ్యూల్ ఏంప్లాయిమెంట్ కార్మికులు ఉన్నారని, వీరికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయకపోవడం వలన కార్మికులను యాజమాన్యాలు తీవ్రమైన దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో బిజెపి కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చి కార్మిక వర్గానికి మోసం చేసిందని విమర్శించారు.జీడి, రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జీడి రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు,పిఎఫ్, ఈఎస్ఐ, ఎనిమిది గంటల పని దినము అదనపు పనికి అదనపు వేతనము ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే కేశవరావు సిఐటియు నాయకులు యన్ లచ్చయ్య, బి పోలయ్య, బి దుర్యోధన, పి కుర్మారావు, ఆర్ ఏకాశి, బి మల్లేసు, పి డోంబురు, కె చిన్న తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్