ఆనందపురం (శ్రీకాకుళం) : ఆనందపురం మండలం సత్తారువు జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం .. ఏపీ 40 కె ఎం 1467 నంబర్ గల కియా కారు వినుకొండ (నరసరావుపేట ప్రాంతం) నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే శుభకార్యానికి వెళుతుండగా, ఉదయం సుమారు 4.45 గంటలకు సత్తారువు జంక్షన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా, ప్రమాద తీవ్రతకు ముగ్గురు పెద్దలు, సుమారు 15 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన చంద్రశేఖర్‌ను వెంటనే విశాఖపట్నంలోని క్యూ-1 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో పాలగాని రామాంజనేయులు (50), ఎస్.కె. మీరా, భవానీ శంకర్ ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించగా, మరో మృతుడి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆనందపురం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, నార్త్ ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమా, లేక ఇతర సాంకేతిక కారణాలా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.
కారు ప్రమాదం - నలుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 19, 2026, 05:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)