- విజయవంతం చేయండి
ప్రజాశక్తి-టెక్కలి రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగస్టు 10న జరుగు జైల్ భరో ధర్నా విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు నంభూరి షన్మఖరావు అన్నారు. బుదవారం సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ద్వారా రైతులకు అన్యాయం చేస్తున్నారని, కార్మిక చట్టాలను కుదించి, లేబరు కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికులకు, ఉద్యోగుల హక్కులను హరిస్తూ అన్యాయం చేస్తున్నారని, కనీస వేతనాలు చెల్లించడం లేదు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే సేవ చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సక్రంగా త్రాగునీరు కూడా అందించడం లేదు. పేదలకు ఇల్లు పట్టాలు, ఇండ్లు, పేదలు దున్నుచున్న భూములకు పట్టాలు ఇవ్వడం లేదని, ప్రశ్నించేవారిని నిర్బంధించే పాలకుల విధానాలను వ్యతిరేకిస్తూ టెక్కలిలో జరుగు ప్రదర్శన, తహాశీల్ధార్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాలో పాల్గోవాలని, ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు బి.వాసుదేవరావు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు కోత మధు, సిఐటియు నాయకులు హెచ్ ఈశ్వరరావు, యు.లక్ష్మణరావు, క్రాంతి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి యల్లయ్య, పాలవలస ధర్మారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)