పోలీసుల ఆధ్వర్యంలో టోకెన్ల పంపిణీ
ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : మండలంలోని పెద్ద పేట గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద ఎరువుల కోసం శనివారం ఉదయం ఆరు గంటల నుంచి రైతులు వరుస కట్టారు.
కొంచెమైనా ఆలస్యమైతే చాలు తమకు ఎరువులు దొరకవేమో అన్న ఆందోళనతో వేకువజాము నుండే పనుగుపర్త ,లక్కుపురం పాలవలస , కొత్తవలస, మర్రిపాడు ,కొత్త లక్కుపురం
రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మదనాపురం, జగన్నాధపురం, బొమ్మక, గెరాడ పేటతో పాటు పరిసర ప్రాంత రైతులు రైతు భరోసా కేంద్రం వద్ద బారులు తీరారు.
పోలీసుల ఆధ్వర్యంలో టోకెన్లు పంపిణీ...
ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు బారులు తీరడంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితి ఏర్పడింది దీంతో విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎస్సై ప్రవళిక రైతులను ఆందోళన చెందకుండా లైన్ లోకి రావాలని సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో రైతులకు వరుస క్రమంలో టోకెన్లను పంపిణీ చేశారు.
రైతుల్లో ఆందోళన ...
ప్రతి ఏడాది ఎరువుల కోసం నానా తంటాలు పడుతున్నామని రైతులు వాపోయారు. సకాలంలో ఎరువులు పంపిణీ చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ అధికారులు చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)