మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదపాక దళితులపై పోలీసులు వేధింపులు ఆపాలి

10 గంటల క్రితం

అదపాక దళితులపై పోలీసులు వేధింపులు ఆపాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 06:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - లావేరు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఆదపాక దళితులపై పోలీసుల వేధింపులు వెంటనే ఆపాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అదపాక దళితులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొన్ని తరాల కిందట పొట్ట కూటి కోసం దొంగతనాలు చేస్తే అదే దొంగతనం పేరుతో నేటికీ నిరంతరం వేధించడం అన్యాయమన్నారు. పాత నేరస్తులని ఎక్కడో దొంగతనం జరిగితే అనుమానంతో అదపాక దళితులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం అన్యాయమన్నారు. రోజువారీ కూలిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే వాళ్ల కుటుంబ పోషణ భారంగా మారుతుందని, వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం డిఎస్పీ స్థాయి అధికారితో ఆర్డీఒ, రెవెన్యూ అధికారులతో అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసుల వేధింపులు ఆపకపోతే దళితులను సమైక్యపరిచి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కుప్పిలి గోపి, పిన్నింటి నరసింహారావు, లచ్చయ్య, సవలాపురం సూర్యనారాయణ, పిన్నింటి ఆదయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్