శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశేష ప్రతిభతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక

1 రోజు క్రితం

జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 03:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ​రణస్థలం

మండలంలోని లంకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ​జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సౌజన్యంతో, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెడ్ రిబ్బన్ క్విజ్ కాంపిటీషన్’లో లంకపేట ఉన్నత పాఠశాల విద్యార్థి బొంతు ఈశ్వరరావు తన సమయస్ఫూర్తి, విషయ పరిజ్ఞానంతో రాణించి జిల్లా స్థాయికి అర్హత సాధించాడు. అలాగే “ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 – ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్” అంశంపై నిర్వహించిన సెమినార్‌లో 9వ తరగతి విద్యార్థిని బొంతు మధురిమ తన వక్తృత్వ నైపుణ్యంతో ఆకట్టుకుంది. ఇంధన వనరుల భవిష్యత్, సుస్థిర అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన ప్రాధాన్యతను సమర్థవంతంగా విశ్లేషించి ప్రశంసలు అందుకోవడంతో పాటు జిల్లాస్థాయికి ఎంపికైంది. ​ఈ విద్యార్థులను తీర్చిదిద్దడంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కెల్ల రమణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు వెంకటప్పడు గైడ్ టీచర్లుగా వ్యవహరించి ప్రత్యేక శిక్షణ అందించారు. ఒకే పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయులు జి.రాంబాబు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ చూపి పాఠశాలకు, మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్