లావేరు: జిల్లా కేంద్రంలోని కె ఆర్ స్టేడియంలో శనివారం నిడజమ్ 20వ నేషనల్ ఇంటర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్ 2026 పోటీల్లో భాగంగా హైజంపులో లావేరు జెడ్‌పి పాఠశాలలో కేశవరాయపురం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని అల్లాడ జీవిత తృతీయ స్థానాన్ని సాధించింది. విద్యార్థిని పీడీ సుదర్శన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది. శ్రీకాకుళం అథ్లెటిక్స్ అసోసియేషన్ చేతులమీదగా ప్రసంసా పత్రం అందుకుంది. ఈ సందర్భంగా విద్యార్థిని జీవితను పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ లంకలపల్లి రాంబాబు, లావేరు టిడిపి మండల అధ్యక్షులు ముప్పిడి సురేష్, ఎచ్చర్ల ఎఎంసి మాజీ చైర్మన్ యినపకుర్తి తోటయ్యదొర, హెచ్‌ఎం పి.జగన్నాదరావు, ఎంఇఒలు మజ్జి మురళీకృష్ణ, గట్టు శ్రీరాములు అభినందించారు.
విద్యార్థినికి తృతీయ స్థానం
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)