ప్రజాశక్తి- కవిటి
జాతీయ స్థాయిలో ఎఐ ప్రాజెక్టుకు 33వ ర్యాంకు సాధించిన డొంకపుట్టుగకు చెందిన 8వ తరగతి విద్యార్థి కంసు నిక్షిత్ను శ్రీచింతామణి సొండి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన బుధవారం ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు పాండవ రామారావు నిక్షిత్కు మెమెంటో అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. అటల్ టింకరింగ్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘ఫైల్ నావిగేటర్ ఎఐ’ ప్రాజెక్టుకు నిక్షిత్ జాతీయ స్థాయిలో 33వ ర్యాంకు సాధించాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కూడా సన్మానం పొందాడు. ఈ సందర్భంగా పాండవ రామారావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే సంఘం లక్ష్యమని తెలిపారు. గ్రామానికి, తరగతికి పేరు తెచ్చిన నిక్షిత్ను అభినందించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.








కామెంట్లు (0)