ప్రజాశక్తి- పలాస
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి దాదాపు ఖరారైంది. మహిళా రిజర్వేషన్ కావడంతో ఆశావహుల ఆశలు నీరుగారిపోయింది. చివరకు ఇద్దరు మహిళల మధ్య పోటీ ఉన్నా... కూటమి ప్రభుత్వం నుంచి అభ్యర్ధులు బలంగా ఉండడంతో చివరకు వైశ్య సామాజిక తరగతికి చెందిన మహిళకు చైర్పర్సన్ అభ్యర్ధిగా వైసిపి అధిస్థానం నాయకులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇద్దరు మధ్య పోటీ... చివరకు ఒకరిని ఎంపిక
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్పర్సన్ కోసం వైసిపి అధిస్థానానికి రిజర్వేషన్ ఖరారు కాకముందు వైసిపి నుంచి సనపల సింహాచలం, పి.వి.సతీష్, బోర కృష్ణారావు పేర్లను ఎంపిక చేశారు. పోటీ చేసేందుకు పోటీపడ్డారు కూడా. చివరకు మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ మహిళ కావడంతో సింహాచలం భార్య ఇతర కారణాలతో వెనుకంజ వేశారు. కృష్ణారావు, సతీష్ సతీమణులు పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలో కూటమి ప్రభుత్వం చైర్మన్ పదవి కోసం వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, మల్లా శ్రీనివాసరావు కుటుంబం నుంచి పోటీలో దిగుతారని బలంగా వినిపించింది. దీంతో కృష్ణారావు, భగవతి తాము పోటీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో సతీష్ సతీమణి పద్మను చైర్పర్సన్ అభ్యర్ధిగా వైసిపి అధిస్థానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.








కామెంట్లు (0)