ప్రజాశక్తి- రణస్థలం
రణస్థలంలో సూర్య ఆస్పతి వద్ద జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో, శ్రీఇడదాసుల విద్యా ఆరోగ్య ఫౌండేషన్ ఆధ్వర్యాన, శంకర్ ఫౌండేషన్ నేత్రాస్పతితో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరాన్ని ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేద, బడుగు బలహీనులకు మెరుగైన ఉచిత వైద్యాన్ని చేరువ చేయడమే తమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శంకర్ ఫౌండేషన్, సూర్య ఆస్పత్రి సహకారంతో గత కొంతకాలంగా అనేక సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విస్తృత సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ వైద్య శిబిరానికి పరిసర గ్రామాల నుంచి సుమారు 60 మంది కంటి సంబంధిత సమస్యలతో హాజరయ్యారు. శంకర్ ఫౌండేషన్ వైద్య బృందం రోగులను క్షుణ్ణంగా పరీక్షించి, వారిలో 17 మందికి కంటి శుక్లాలు ఇతర శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించారు. అనంతరం ఎంపికైన రోగులను ఉచిత ఆపరేషన్ల నిమిత్తం శంకర్ ఫౌండేషన్ వారి ప్రత్యేక బస్సులో విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడంతో పాటు దృష్టి లోపాలున్న వారికి కళ్లద్దాలను సూచించారు. శిబిరానికి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు ఫౌండేషన్ తరఫున ఉచిత భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో వైద్యులు యశ్వంత్, ఫౌండేషన్ అధ్యక్షులు ఇడదాసుల తిరుపతిరాజు, సభ్యులు మహమ్మద్ తాజ్ మొహియుద్దీన్, బలివాడ శ్రీనివాసరావు, బేతా నర్సింహులు, శంకర్ ఫౌండేషన్, సూర్య ఆస్పతి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.









కామెంట్లు (0)