బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంపీ నిధులతో కళ్యాణ మండపం

1 గంట క్రితం

ఎంపీ నిధులతో కళ్యాణ మండపం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కవిటి

కవిటిలో అగ్నికుల క్షత్రియుల చిరకాల అవసరాన్ని నెరవేర్చే దిశగా కళ్యాణ మండప నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించారు. ఈ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, దాసరి రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. కళ్యాణ మండపం అందుబాటులోకి వస్తే సామాజిక, శుభకార్యాల నిర్వహణకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు పొందల కృష్ణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ, ఎఎంసి చైర్మన్ మణి చంద్రప్రకాష్, పిఎసిఎస్ అధ్యక్షుడు బాసుదేవ్ ప్రధాన్, జెడ్‌పిటిసి మాజీ సభ్యుడు బెందాళం రమేష్, మాజీ సర్పంచులు పూడి లక్ష్మణరావు, ఆరంగి మధు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బార్ల చిన్నబాబు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్