ప్రజాశక్తి- ఆమదాలవలస : విశాఖపట్నం కెజిహెచ్లో చికిత్స పొందుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్.కల్లు మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ బి.అప్పారావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బండా జిల్లా బెల్లమండికు చెందిన కల్లు గతేడాది నుంచి పట్టణంలోని పలు దుకాణాల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి పట్టణంలోని కొత్తవీధిలో తూలుగు నరసయ్యకు చెందిన డాబా ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి మేడపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని తొలుత శ్రీకాకుళం సర్వజనాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కెజిహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మున్సిపాలిటీలోని మోనింగివారి వీధి వార్డు సచివాలయ విఆర్ఒ ఎం.అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నదర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ అప్పారావు తెలిపారు.
చికిత్స పొందుతూ ఉత్తరప్రదేశ్ వాసి మృతి
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)