ప్రజాశక్తి- ఆమదాలవలస
పట్టణంలోని చంద్రయ్యపేట సమీపంలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) భవనంలోకి తరలిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిభాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో న్యాయపరమైన కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ భవనంలోకి కోర్టును తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర హైకోర్టు, జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15న ఉదయం 11 గంటలకు పిఏసిఎస్ భవనంలోకి కోర్టును తరలించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు నుంచి కొత్త భవనంలోనే పూర్తిస్థాయిలో కోర్టు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆమె కోరారు.








కామెంట్లు (0)