ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో...టిడిపి రెబల్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీజ

1 రోజు క్రితం

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్‌పర్సన్ బరిలో...
టిడిపి రెబల్ అభ్యర్థిగా దువ్వాడ శ్రీజ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పలాస

పలాస-కాశీబుగ్గ మున్సిపల్ చైర్పర్సన్ టిడిపి రెబల్ అభ్యర్థిగా డాక్టర్ దువ్వాడ శ్రీజ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఓటమి ఎరుగని కౌన్సిలర్‌గా గుర్తింపు ఉన్న దువ్వాడ శ్రీకాంత్ చైర్మన్ టిక్కెట్ ఆశించారు. మహిళా రిజర్వేషన్ కావడంతో ఆయన కుమార్తె శ్రీజ కోసం సీటు ఆశించి భంగపడ్డారు. దీంతో ఆమెను టిడిపి రెబల్ అభ్యర్థిగా బరిలో దింపడంతో, ఆమె శుక్రవారం నామినేషన్ దాఖలు వేశారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీజ మాట్లాడుతూ తన తండ్రిని ఆదరించే విదంగా మున్సిపాలిటీలోని 36 వార్డుల ప్రజలు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల తన కుమార్తెను బరిలో దింపాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే గౌతు శిరీష విజయం కోసం ఎంతో శ్రమించానని, అయినా తనను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ సమయం ఉన్నా ఇంటింటికీ వెళ్లి తన కుమార్తెను గెలిపించాలని కోరుతానన్నారు. అన్ని పార్టీల్లో తనకు రాజకీయ దెబ్బలు తగులుతున్నాయని, వాటిని ఓర్పు, సహనంతో ఎదుర్కొని ముందుకు వెళ్తున్నానన్నారు.

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్