ప్రజాశక్తి- సోంపేట
సోంపేటలోని ఆదర్శ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పోలురోతు శ్రీదేవికి 'ద్రవిడ విశ్వవిద్యాలయం (కుప్పం)' నుంచి డాక్టరేట్ పట్టా లభించినట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, కాగాం గ్రామానికి చెందిన శ్రీదేవి ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు భాష, అనువాద అధ్యయన శాఖలో ఆచార్య కిన్నెర శ్రీదేవి (ప్రొఫెసర్, డీన్) పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఆమె డాక్టర్ శ్రీదేవి 'కాల్పనిక సాహిత్యం - భిన్న భావనా తాత్వికత' అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని సమర్పించారు. పరిశీలక మండలి సిఫార్సుల మేరకు విశ్వవిద్యాలయం ఆమెకు పిహెచ్‌డి డిగ్రీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తోటి ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్ బొమ్మిడి తేజేశ్వరరావు, కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.








కామెంట్‌లు (0)