ప్రజాశక్తి-శ్రీకాకుళం : ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనం సరిగా లేదంటూ సరుబుజ్జిలి లో ఎన్నికల సిబ్బంది శనివారం ఆందోళనకు దిగారు. సరుబుజ్జిలి మండలంలో ఈ నెల 29 న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందజేసిన అనంతరం భోజనాలను ఏర్పాటు చేశారు. భోజనం నాణ్యంగా లేకపోవడంపై ఎన్నికల సిబ్బంది మండిపడ్డారు. కనీసం కూర కూడా పెట్టకపోతే భోజనం ఎలా చేసేదని ప్రశ్నించి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.
భోజనంలో కూర కూడా పెట్టరా ? : ఎన్నికల సిబ్బంది ఆందోళన
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)