శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తోడేస్తున్నారు...

15 నవంబర్, 2026

తోడేస్తున్నారు...
చిత్రావతి నదిని తోడేస్తున్న పట్టించుకునే వారు కరువు 
రోజూ  పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 04:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చిత్రావతి నదిని తోడేస్తున్న పట్టించుకునే వారు కరువు

రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా

ప్రజాశక్తి - శ్రీసత్యసాయి : కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న చిత్రావతి నదిలో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. నదిలో నీరు లేనందున రోజు పదుల సంఖ్యలో టిప్పర్లు ట్రాక్టర్లు ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. నదిలో యంత్రాలతో ఇసుక తోడేస్తున్న పట్టించుకునే వారు లేరని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు కొలువైన ప్రదేశం అయినప్పటికీ నిత్యం ఇసుక ఇష్టారాజ్యాంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే లేరని నదీ పరివాహక ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతున్న కొందరు వ్యక్తులు ఈ దందా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టిప్పర్ రూ.20వేల నుంచి 25 వేల రూపాయలు, ట్రాక్టర్ అయితే రూ. 3వేల నుంచి 4 వేల రూపాయల వరకు విక్రయించుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నదిలో విచ్చలవిడిగా ఇసుక తరలిపోతుంటే పరిసర గ్రామాల వ్యవసాయ బోర్లు తాగునీటి బోర్లలో భూగర్భ జలాలు అడిగింటి పోతున్నాయని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక నదిలో పట్టణానికి అవసరమయ్యే తాగునీటి రక్షిత పథకాలు కూడా నీరు అడిగింటి పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ లు దగ్గరలో లేకపోవడం తో ఇసుకను ఎక్కడపడితే అక్కడ తోడేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. పట్టణంలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న యజమానులతో పాటు సమీప మండలాలకు అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ బోర్లతో పాటు నది పరిసరాల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లలోసైతం నీరు ఇంకిపోతున్నాయని తద్వారా తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ అక్రమ ఇసుక రవాణా రోజు తెల్లవారుజామున ఎక్కువగా జరుగుతుందని ఇప్పటికైనా పోలీస్ ,రెవెన్యూ, గనుల సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజల కోరుతున్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్