- అఖిల భారత రైతు జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
- ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పెద్దన్న, మారుతి
ప్రజాశక్తి-ధర్మవరం రూరల్ : అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, ఉపాధ్యక్షులు ఎ.మారుతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని గరుడంపల్లి గ్రామంలో మహిళా రైతు ఆనందమ్మతో కలిసి జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మహాసభలు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకూ జరుగుతాయిని, అందులో ప్రతి రైతు పాల్గొనాలని కోరారు. జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కరువు సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని, రూ. 25వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నీటితో నింపాలని, ప్రతి చెరువుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలని, పంటలు నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, సాగు సహాయక చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచాలని, దినసరి కూలి రూ. 600 కు పెంచాలని, గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగు, సాగునీరు అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎపి చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్‌హెచ్.బాషా, జెవి.రమణ, రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్, చండ్రాయుడు, నారాయణ, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)