శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీసత్యసాయి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

19 నవంబర్, 2026

స
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కొత్తచెరువు రూరల్ : ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ, మడకశిర రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 12 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో పెనుకొండ రెవెన్యూ డివిజన్ 7, మండలాలు చిలమత్తూరు, గోరంట్ల,హిందూపురం, లేపాక్షి, పరిగి, పెనుకొండ, సోమందేపల్లి, మడకశిర రెవెన్యూ డివిజన్ 5 మండలాలైన అగళి, అమరాపురం, గుడిబండ, మడకశి, రొళ్ల, ఎన్నికల షెడ్యూల్ వివరాలు

నవంబర్ 21 న ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం (ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు).

నవంబర్ 21 న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రదర్శన.

నవంబర్ 23 న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ,

నవంబర్ 24 న నామినేషన్ల పరిశీలన.

నవంబర్ 25 న నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు చివరి తేదీ.

నవంబర్ 26 న అప్పీళ్ల పరిష్కారం. నవంబర్ 27 న అభ్యర్థుల ఉపసంహరణకు చివరి గడువు మధ్యాహ్నం 3 గంటల వరకు- నవంబర్ 27: పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన చేశారు.డిసెంబర్ 2: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. డిసెంబర్ 2: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుందని ఎన్నికల సంఘం కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా గ్రామ పంచాయతీ లేదా వార్డులో న్యాయపరమైన అడ్డంకులు లేదా ఇతర కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోతే, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే రీపోలింగ్ నిర్వహించిన గ్రామ పంచాయతీల్లో రీపోలింగ్ ఫలితాలు ప్రకటించిన తర్వాతే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని స్పష్టం చేసింది.గ్రామాల్లో మొదలుకానున్న ఎన్నికల సందడి

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పెనుకొండ, మడకశిర డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో రాజకీయ సందడి మొదలుకానుంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు నామినేషన్లకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్