హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పాము కాటుకు చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటనపై డాక్టర్ల బృందం విచారణ చేపట్టింది. పరిగి మండలం కాలువపల్లికి చెందిన రామాంజినమ్మ (45) ఈ నెల 25న పాము కాటుకు గురయ్యారు. ఆమెను హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. డాక్టర్లు వెంకటరమణనాయక్, శివప్రసాద్ నాయక్ ను విచారణ అధికారులుగా నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విచారణ నిర్వహించారు. తొలుత మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. వైద్యురాలు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఆస్పత్రి సిబ్బందిని కూడా ఆ రోజు జరిగిన పరిణామాలపై ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు.
ఆస్పత్రిలో మహిళా మృతిపై విచారణ
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)