శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్ఆర్ కాలనీలో బీహార్ ముఠా కలకలం : ఆరుగురిలో ఒకరిని పట్టుకున్న కాలనీవాసులు

19 నవంబర్, 2026

ఆర్ఆర్ కాలనీలో బీహార్ ముఠా కలకలం ఔ
ఆరుగురిలో ఒకరిని పట్టుకున్న కాలనీవాసులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులకు స్థానికులే దొంగలను పట్టించి అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. హిందూపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పులమతి రోడ్డు సమీపంలో ఉన్న ఆర్ఆర్ కాలనీలో వరుస చోరీలు, దొంగల సంచారం కాలనీవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బీహార్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు కాలనీలోని ఇళ్లలో చోరీలకు యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని కాలనీవాసులు పట్టుకొని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే నిందితుడిని తీసుకెళ్లేందుకు గురువారం ఉదయం టూవీలర్‌పై ఒక్క కానిస్టేబుల్‌ను మాత్రమే పంపించడంతో పోలీసుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఇప్పటికే నాలుగు ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. దొంగలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలను సైతం స్థానికులు టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌కు పంపించినట్లు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి పట్టుబడిన నిందితుడిని తీసుకెళ్లేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు మరింత చర్చనీయాంశంగా మారింది. స్థానికులు దొంగను పట్టుకున్నామని, వచ్చి తీసుకెళ్లాలని సమాచారం అందిస్తే కనీసం పోలీసు జీపును కూడా పంపకుండా ఒక్క కానిస్టేబుల్‌ను టూవీలర్‌పై పంపించడంపై వారు ప్రశ్నిస్తున్నారు.స్థానికులే దొంగలను పట్టుకొని అప్పగించిన తర్వాత ప్రత్యేక బృందాలతో గాలించి ముఠాను పట్టుకున్నట్లు ప్రకటనలు చేయడం కంటే, ముందుగానే నిఘా పెట్టి చోరీలను అరికట్టడంపై పోలీసులు దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్