శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంచాయతీ అభివృద్ధే లక్ష్యం సర్పంచ్ అభ్యర్థి

19 నవంబర్, 2026

పంచాయతీ అభివృద్ధే లక్ష్యం సర్పంచ్ అభ్యర్థి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి ఓబుల దేవర చెరువు:--- మండలం ఓడి చెరువు గ్రామ పంచాయతీ టిడిపి మద్దతు సర్పంచ్ గా సహకార సంఘం అధ్యక్షులు తుమ్మల మహబూబ్ బాషా సతీమణి షేక్ ముభషిర బేగం సర్పంచ్ అభ్యర్థిగా గురువారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓడి చెరువు పంచాయతీ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు.తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓడి చెరువు పంచాయతీ నీ ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మహబూబ్ బాషా, రాజారెడ్డి, బిరాం సాహెబ్, బోలి బాబా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్