వరుసగా మూడు దశాబ్దాలు కాలం సర్పంచ్‌గా సేవలందించిన కుటుంబం
మరోసారి బరిలోకి బత్తల చంద్రమ్మ
మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర.. ఆరు పర్యాయాలు సర్పంచ్ పదవిలో ప్రజలకు సేవలు.. తరతరాలుగా ప్రజలతో మమేకమైన కుటుంబం.. ఇవన్నీ బత్తల కుటుంబానికి గ్రామీణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చినట్లు మద్దతు దారులు పేర్కొంటున్నారు . రాజకీయాలను కేవలం పదవుల కోసం కాకుండా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర ప్రజలకు సేవ చేసే వేదికగా భావిస్తూ బత్తల కుటుంబం సాగిస్తున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, గ్రామంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటమే బత్తల కుటుంబం రాజకీయ ప్రయాణంలో ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. బత్తల వెంకటరమణ వరుసగా ఆరుసార్లు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఈ కుటుంబం, గ్రామ ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతూ, గ్రామ ప్రజల విశ్వాసాన్ని పొందిన కుటుంబంగా బత్తల కుటుంబం గుర్తింపు పొందింది. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై స్పందించడం తమ రాజకీయ ప్రస్థానంలో భాగంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రజాసేవను మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో బత్తల చంద్రమ్మ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గతంలో ఆమక భర్త మాజీ సర్పంచ్ గా పనిచేసిన అనుభవం , కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని అండగా చేసుకొని ప్రజల ఆశీస్సులతో మరోసారి గ్రామ పాలనలో భాగస్వామ్యం కావాలని ఆమె అభిలషిస్తున్నారు. ఆరుసార్లు సర్పంచ్‌గా సేవలందించిన కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో చంద్రమ్మ ముందుకు సాగుతున్నారు. అయితే గతంలో అందించిన సేవలతో పాటు భవిష్యత్తులో గ్రామానికి చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ అభివృద్ధి పరంగా రూపొందించే ప్రణాళికలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. కదిరి రూరల్ కుమ్మరవాండ్లపల్లి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో అదే గ్రామానికి చెందిన వైసిపి స్టేట్ ఎక్స్యూటివ్ మెంబర్ డాక్టర్ హరి ప్రసాద్ తల్లి బత్తల వెంకటరమణ సతీమణి చంద్రమ్మ గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ గా పోటీలో ఉన్నారు. ఆ గ్రామ పంచాయతీ ప్రజలతో విడదీయలేని అనుబంధం ప్రజల కష్టాలలో తోడు ఇవే బత్తల కుటుంబ రాజకీయ ప్రస్థానానికి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. మరోసారి ప్రజల మద్దతు కోరుతూ సర్పంచ్ అభ్యర్థిగా బత్తల చంద్రమ్మకు పోటీకి సిద్ధం అయ్యారు.








కామెంట్లు (0)