సంజీవిని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ సూచించారు. ఈమేరకు ఆయన శుక్రవారం సంస్కృతి కళాశాలలో జరిగిన సంజీవిని ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఫైరోజా బేగం పర్యవేక్షణలో, జిల్లాలోని వైద్యాధికారులు మెడికల్ సిబ్బంది మరియు సంజీవని మిత్రులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయని తెలిపారు రోగుల వివరాల నమోదు, డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానం.ప్రజలకు సకాలంలో, మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు సంజీవని మిత్రుల పాత్ర, బాధ్యతల గురించి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో సంజీవని కార్యక్రమ నోడల్ అధికారి డా. జె. పద్మజ, ఇన్చార్జ్, టాటా ఎండి బృందం ప్రతినిధులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సంజీవని మిత్రులు ,ఇతర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్లు (0)