ప్రజాశక్తి-ధర్మవరం టౌన్ : ఆర్థిక, అనారోగ్య సమస్యలు భరించలేక వైసిపి కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక చెన్నకేశవపురం ప్రాంతానికి చెందిన వైసిపి కార్యకర్త మహేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వన్ టౌన్ సిఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఉరి వేసుకుని వైసీపీ కార్యకర్త ఆత్మహత్య
13 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)