మెప్మా ఆర్పీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : మెప్మా ఆర్పీ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ... మంగళవారం విశాఖ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఎపి మెప్మా ఆర్ పి ఉద్యోగుల సంఘం ( సిఐటియు) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షురాలు పి.మణి, కార్యదర్శి సిహెచ్ ఝాన్సీ మాట్లాడుతూ ... పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్పీల జీతాలు పెంచాలన్నారు. జీతాలను ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లించాలని కోరారు. ఆర్పిల జీతాలను వ్యక్తిగత అకౌంట్లో వేయాలి అన్నారు. జీతాల్లో ఎటువంటి కోతలు విధించకూడదని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.









కామెంట్‌లు (0)