ప్రజాశక్తి-ఆనందపురం (విశాఖ) : ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్‌లో ఓ యువకుడి మృతదేహం శనివారం ఉదయం నీటిపై తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కృష్ణా జిల్లా పోలంకి మండలం పదనామపురం గ్రామానికి చెందిన శ్రీరామనేని సందీప్ (31), తండ్రి అశోక్‌గా గుర్తించారు. సందీప్ శుక్రవారం ఉదయం బుల్లెట్ వాహనంపై గంభీరం రిజర్వాయర్‌కు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడి ముక్కు, చెవి వద్ద గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహంపై చేపలు కొరికినట్లు ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
గంభీరం రిజర్వాయర్‌లో యువకుడి మృతదేహం
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)