గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలే కుప్పంనాయుడికి ఘన నివాళి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు

2 గంటల క్రితం

United movements of workers and farmers are the fitting tribute to Kuppam Naidu: CPM District Secretariat member Reddy Shankara Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రజల కోసం ప్రజల మధ్య జీవించిన ఆదర్శ మూర్తి కామ్రేడ్ రెవెళ్ళ కుప్పం నాయుడు అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అన్నారు. గురువారం కుప్పం నాయుడు గారి 14 వ వర్ధంతిని విజయనగరం లో సీపీఎం విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కోట వద్ద నిర్వహించారు. ముందుగా కుప్పం నాయుడు గారి చిత్ర పటానిక పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టరెట్ చేసి ప్రోఫీసర్ ఉద్యోగం వదిలేసి పేద ప్రజలు కోసం, సామ్యవాద రాజ్యం సాధాన కోసం జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి కుప్పం నాయుడు అని శంకరరారావు కొనియాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రం లో కూటమి ప్రజావ్యతిరేక పాలన పై కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే కుప్పం నాయుడు గారికి నిజమైన నివాళి ఇచ్చి నట్టు అవుతుంందని అన్నారు. వ్యవసాయ కార్మికులు కోసం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా జీవితాంతం కృషి చేశారని, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మహాత్మ గాంధీ గ్రామీన ఉపాధి హామీ పద కాన్ని నిర్వీర్యం చేసేందుకు వి. జి. రామ్ జీ పేరుతో కుట్ర చేస్తున్నది. మరో వైపు రైతులకు నష్టం చేసే నల్ల చట్టాలు తెచ్చింది, కార్మికులు 80 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మికుచట్టాలు ని మార్చి 4 కోడ్లు తెచ్చిందన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు చడమే కుప్పం నాయుడుకి నిజమైన నివాళి అని అందుకు సీపీఎం విజయనగరం జిల్లాలో ఆ కృషి చేస్తున్నదని అన్నారు. నేటి తరం యువత కుప్పం నాయుడు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పని చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ నాయకులు శ్రీను, రాజు, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్