ప్రజాశక్తి - గాజువాక: విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలోని కోటవీధిలో వెలిసిన పురాతన హాజరత్ ఇషాక్ మదని ఔలియా దర్గా 769వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం పెదగంట్యాడ మండలం, జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని చిన్నపాలెం గ్రామానికి చెందిన ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు దర్గాను సందర్శించారు. అనంతరం దర్గాలోని హాజరత్ ఇషాక్ మదని ఔలియా సమాధి (మజార్)పై భక్తిశ్రద్ధలతో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు మాట్లాడుతూ... దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. కాగా, చిన్నపాలెం గ్రామం నుండి దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో గ్రామ కమిటీ సభ్యులు, ప్రముఖులు, మత పెద్దలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు, భక్తులు పాల్గొని ఉర్సును ఘనంగా నిర్వహించారు.
హాజరత్ ఇషాక్ మదని ఔలియా దర్గాలో ఘనంగా చాదర్ సమర్పణ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)