ప్రజాశక్తి - విశాఖ : దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) లలిత్ బోరా శనివారం సింహాచలం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించి, వాటి పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు స్టేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న పనులను సమీక్షించారు. ఈ తనిఖీలో వాణిజ్య, ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)