బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఘనంగా పివి.సింధు అకాడమీ శంఖుస్థాపన

11 గంటల క్రితం

Grand Foundation Stone Laying Ceremony for P.V. Sindhu Academy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 150 కోట్లతో నిర్మాణం


ప్రజాశక్తి - విశాఖపట్నం : విశాఖ తూర్పు పరిధి 10 వార్డులోని తోట గరువులో ప్రభుత్వం కేటాయించిన మూడు ఎకరాల భూమిలో నిర్మించే బ్యాడ్మింటన్ అకాడమీ కి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి రామ్ ప్రసాద్, ఎమ్మెల్యే లు వెలగపూడి కృష్ణ బాబు, పల్లా శ్రీనివాస్ రావు, గంటా శ్రీనివాస్ రావు, పివి.సింధు, తదితరులు పాల్గొన్నారు. పివి.సింధు మీడియాతో మాట్లాడుతూ .... ఇక్కడ రూ.150 కోట్లతో అకాడమీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ 1400 మందికి శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సమగ్ర శిక్షణ శిబిరాలు నిర్వహించడం చేయాలని కోరారు. క్రమ శిక్షణతోనే క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు. అకాడమీ డైరెక్టర్ స్వాతి, వెలగపూడి మాట్లాడుతూ .... తూర్పులో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పల్లా మాట్లాడుతూ .... మహిళలు ఛాంపియన్ లు అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ .... సిఎం క్రీడలకు ప్రోత్సాహం ఇస్తున్నారు అని కొనియాడారు. రాష్ట్రంలో మరిన్ని అకాడమీలు రావాలి అని ఆకాంక్షించారు. లోకేష్ మాట్లాడుతూ .... 18 నెలల్లో అకాడమీ నిర్మాణం పూర్తవుతుంది అన్నారు. ఎపి స్పోర్ట్స్ హబ్ గా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతైనా అవసరం అన్నారు. క్రీడలు క్రమ శిక్షణ నేర్పుతుంది అన్నారు. అతిధులకి నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు.

pv.sindhu


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్