ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భోగాపురం దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి: ప్రజా సంఘాల డిమాండ్

03 ఆగస్టు, 2026

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-భోగాపురం: భోగాపురం దళితపేటలో సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై కొనసాగుతున్న వివక్ష, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసు కునేందుకు ప్రజా సంఘాలు చేపట్టిన సర్వేలో భాగంగా భోగాపురం గ్రామంలోని దళితపేటను సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మండల కన్వీనర్ కె. సోము నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామంలో ఒక్క బిందె మంచినీరు కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి వాటర్ ట్యాంక్ నిర్మాణం, రహదారులు, కాలువలు, స్మశానవాటికకు వెళ్లే రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పేదలకు ప్రభుత్వ గృహాలు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ–ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దళితుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులగుజ్జుల అప్పారావు, చెవిటి భాగ్యలక్ష్మి, ఎల్లబెల్లి పార్వతి, అప్పలనరస, రత్నం, నాగమణి, రాజులు, కళావతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్