సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జీతాలు చెల్లించాలి

25 జూన్, 2026

visakha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 11:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

కెజిహెచ్, ప్రభుత్వ హాస్పిటల్స్ సెక్యూరిటీ గార్డ్స్

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : కెజిహెచ్,ప్రభుత్వ హాస్పిటల్స్ సెక్యూరిటీ గార్డులకు ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు పి. వెంకటరావు డిమాండ్ చేశారు. గురువారం కెజిహెచ్ లో థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డు ల సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది ప్రభుత్వ హాస్పిటల్స్ లో సెక్యూరిటీ గార్డులకు 10వ తేదీ లోపు జీతాలు కాంట్రాక్టర్ చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం వీరికి ఈఎస్ఐ పేపర్లు ఇవ్వాలని కోరారు. మరో ప్రక్క జివో 138 ప్రకారం జీతాలు చెల్లించాలని, పిఎఫ్,ఈఎస్ఐ మొత్తం జీతంపై చెల్లించాల కోరారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్,డీజిల్,గ్యాస్ తో పాటు నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. కానీ ఈ ధరలకు అనుగుణంగా వీరి జీతాలు పెరగలేదని విమర్శించారు. తక్షణం కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల జీతాలను రూ.26 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే జిల్లా లేబర్ ఆఫీసర్ వారికి కంప్లైంట్ ఇచ్చామన్నారు. యూనియన్, కాంట్రాక్టర్, కకెజిహెచ్ సిబ్బందితోపాటు లేబర్ ఆఫీసులోజరిగిన జాయింట్ మీటింగ్ లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి నెల 7న జీతాలు ఇవ్వాలని లేబర్ ఆఫీసర్ చెప్పడం జరిగిందన్నారు. మరో ప్రక్క జీతాలు టైముకు ఇవ్వకపోతే రెండు వేల నుండి మూడు వేల వరకు ప్రతి జీతం మీద పెనాల్టీ విధించవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరికి జివో ప్రకారం జీతాలు, పిఎఫ్,ఈఎస్ఐలు చెల్లించాలని లేనియెడల ఆయా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. తక్షణం థర్డ్ పార్టీ సెక్యూరిటీ గార్డ్స్ కు లేబర్ ఆఫీసులో ఆర్ జె సి ఎల్ చెప్పిన విధంగా కాంట్రాక్టర్ జీతంతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.నూకరత్నం,వై.దుర్గ,కెజిహెచ్ సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్