- ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు
ప్రజాశక్తి - ఆనందపురం : ఆనందపురం మండలం వేములవలస పూల మార్కెట్ సమీపంలోని పెందుర్తి రోడ్డు, బంటుపల్లి కల్లాలు రోడ్డు, వేములవలస బ్రిడ్జి ప్రక్కన రోడ్డుపై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేస్తున్నారని, నిషేధిత ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే రూ.1,000 జరిమానా విధిస్తామని, చలానా ఆన్‌లైన్‌లో నమోదవుతుందని ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు హెచ్చరించారు. రోడ్డుపై వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారులు పట్టించుకోవడం లేదని ఎస్‌ఐ పాపారావు తెలిపారు. రెండుసార్లు చలానా పడిన అనంతరం మూడోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారులపై వాహనాలు నిలపకుండా సహకరించాలని కోరారు.









కామెంట్‌లు (0)