ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం జిల్లా శిష్ట కరణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డబ్బీరు సత్యప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి గౌరీశంకర్ హాజరై ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. అనంతరం సుమారు 120 మంది సభ్యులు, ప్రతినిధుల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 9 శాఖల (బ్రాంచ్‌ల) అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారులుగా గౌరీశంకర్, గౌరీ ప్రసాద్ వ్యవహరించి, సర్వసభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో సాలూరు మోహనరావు అధ్యక్షుడిగా, బాసింగి తిరుపతిరావు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తుంబలి ప్రసాదరావు వైస్ ప్రెసిడెంట్‌గా, చక్రమహంతి కవిత ప్రధాన కార్యదర్శిగా, మానాపురం తిలక్ కోశాధికారిగా, బసూరి శ్రీనివాసరావు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సాలూరు మోహనరావు మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి బ్రాంచ్‌ను స్వయంగా సందర్శించి, సభ్యులందరినీ కలుపుకొని సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలివాడ సత్యారావు, నగుమంత్రి వెంకటేశ్వరరావు, వెంకుమహంతి మన్మధరావు, పోతరాజు, కేవీన్ మూర్తి పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 9 బ్రాంచ్‌ల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.
విశాఖ జిల్లా శిష్ట కరణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
03 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 03, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)