గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

14 నవంబర్, 2026

రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
 హోం మంత్రి అనిత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 05:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హోం మంత్రి అనిత

ప్రజాశక్తి - కొత్త పోలవరం : మండలం కొత్త పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మండలంలోని కొత్త పోలవరం వద్ద ప్రమాదం జరిగిన స్థలాన్ని శనివారం మంత్రి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. అక్కడి నుంచి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న హోం మంత్రి అనిత, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి విశాఖపట్నంలోని షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్