- వర్షంలోనే నిరసన తెలిపిన విద్యార్థులు
ఆంధ్ర విశ్వవిద్యాయలంలోని హాస్టల్ పైకప్పులకు పెచ్చులు ఊడి, చిల్లులు పడ్డాయి. వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు లీక్ అవుతుండటంతో విద్యార్థులతో అవస్థలు పడుతున్నారు. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేకించి శాతవాహన హాస్టల్ పైకప్పు పరిస్థితి మరింత దారుణంగా ఉందని విద్యార్థులు వాపోయారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎయు మెయిన్‌గేట్, విసి కార్యాలయం వద్ద వర్షంలోనే విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన అనంతరం అధికారులు స్పందించి దసరా సెలవులు ముగిసేలోగా రూఫ్ లీకేజీలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే అదనపు ఫీజులు కూడా రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.








కామెంట్‌లు (0)