ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన కొమ్మాది డిఎస్ఏ స్టేడియంలో జరిగిన అండర్ 17 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని ఎ.కోడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పాఠశాలకు చెందిన లెక్కల ఉమ 400 మీటర్ల హడ్డిల్స్‌లో ప్రథమ స్థానం, తర్రా మధుశ్రీ 1500 మీటర్లలో ప్రథమ స్థానం, 3000 మీటర్లలో ద్వితీయ స్థానం, కిల్లి ప్రమోదుని త్రిపుల్ జంప్‌లో ప్రథమ స్థానం, 800 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానం, హైజంప్‌లో ద్వితీయ స్థానం, లెక్కల ఉమ హైజంప్‌లో ప్రథమ స్థానం, అనకాపల్లి భార్గవి రేస్ వాక్ మూడు కిలోమీటర్లులో ప్రథమ స్థానం, గండ్రెడ్డి తేజ హర్థిల్స్ 100 మీటర్లులో ద్వితీయ స్థానం, 200 మీటర్లులో ద్వితీయ స్థానం, తర్రా వైష్ణవి 400 మీటర్ల హడ్డిల్స్ లో తృతీయ స్థానం, జి.మనోహర్ హైజంప్‌లో తృతీయ స్థానం, జి.సాయి శంకర్ 400 మీటర్ల హర్డిల్స్‌లో తృతీయ స్థానం పొందారు. వీరు ఈ నెల 28వ తేదీన కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కేయంసిహెచ్ ప్రసాద్ రావు, తమ్ము నాయుడులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ 2 ఆళ్ల శేఖర్, జీవ శాస్త్ర ఉపాధ్యాలు సూరెడ్డి బాబురావు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎ.కోడూరు విద్యార్థుల ఎంపిక
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)