ప్రజాశక్తి- భీమునిపట్నం
విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలబాలికల కరాటే పోటీలలో భీమిలి బ్యాంకు కాలనీ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ స్కూల్ నాలుగో తరగతి విద్యార్థి వైఎస్. మోక్షజ్ఞ నాయుడు అద్భుత ప్రతిభ కనబరిచాడు కాకినాడలో ఈనెల15న జరిగిన 5వ ఇన్విటేషనల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ 2026 జాతీయ కరాటే పోటీలలో పాల్గొని కుమిటిలో రెండవ స్థానం, కాటాలో మూడవ స్థానం సాధించాడు. జాతీయ పోటీలలో గెలిచిన విద్యార్థి మోక్షజ్ఞ నాయుడును సన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో పతకాలు సాధించాలని, తద్వారా పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు








కామెంట్‌లు (0)